కోరుట్ల: మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు 8 నెలలుగా జీతాలు రావడంలేదని ఆందోళన
జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు జనవరి నెలలో జీతం వచ్చిందని ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు, 8 నెలలు గడుస్తున్నా జీతాలు రాకపోవడంతో ఇల్లు గడవడం కష్టం అవుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు అవుట్సోర్సింగ్ జీతం 15000 అయినప్పటికీ 10000 మాత్రమే ఇస్తున్నారని అది కూడా ఎనిమిది నెలల నుండి రాలేదని వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు...