అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు లోని హైవేపై ప్రమాదవశాత్తు హోర్డింగ్ మీద పడడంతో ఇద్దరు వృద్ధులకు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి సంజీవరెడ్డి అని ఇద్దరిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.