పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట రిజర్వాయర్ ను గురువారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పీఏబీఆర్ నుంచి వస్తున్న నీటి ఫ్లో గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు ముచ్చుకోట రిజర్వాయర్ ను నీటితో నింపి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏబీఆర్, ముచ్చుకోట రిజర్వాయర్ అధికారులు పాల్గొన్నారు.