ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలైన ఘటన ASF జిల్లా కేంద్రంలోని హీనా జిన్నింగ్ మిల్లు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 6గంటలకు కాగజ్నగర్ వైపు నుంచి అసిఫాబాద్ కు వస్తున్న ప్యాసింజర్ ఆటో హీనా జిన్నింగ్ మిల్లు సమీపంలో ఆటో అదుపుతప్పి రోడ్డుకింద బోల్తా పడడంతో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.