కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దె చోర్ లో భాగంగా సంతకాల సేకరణ
కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మూడుసార్లు అక్రమ మార్గంలో గద్దె నెక్కిందన్నారు.మోడీ, అమిత్ షా కుట్రలు, అక్రమాల కారణంగా బీజేపీ గెలిచిందన్నారు.త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.