పత్తికొండ: క్రిష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత రెండు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
కృష్ణగిరి మండలం శుక్రవారం చిట్యాల గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో ఎంపీపీ వాహనం ధ్వంసమైంది. వైఎస్సార్సీపీకి అడ్డుకట్ట వేస్తూ టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు.