మార్కాపురం: తర్లుపాడులో సర్పంచ్ ఎంపీటీసీల నిరసనతో వాయిదా పడిన మండల సర్వసభ్య సమావేశం
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాకముందే సర్పంచులు ఎంపీటీసీలు నిరసనతో వాయిదా పడింది. 15వ సంఘం ఆర్థిక నిధులు వచ్చినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు, సర్పంచులు చేయించిన పనులకు బిల్లులు చెల్లించలేదు అన్నారు. వాటిని పరిశీలించి చేస్తాం అనడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, సర్పంచుల బిల్లులు వెంటనే చెల్లించాలని సర్పంచులు ఎంపీటీసీలు ప్రభుత్వాన్ని కోరారు