రేణిగుంట కుర్ర కాలువ జగనన్న కాలనీలో తల్లి ఇద్దరు పిల్లల అదృశ్యం
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం తిరుపతి: రేణిగుంట మండలం కుర్రకాలువ జగనన్న కాలనీలో నివసిస్తున్న కె. నాగమణి(30) అనే మహిళ ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైంది. అక్టోబర్ 18న రాత్రి 10.30గంటలకు భర్త శివకుమార్‌తో గొడవ పడి ఇంటినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. భర్త గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మంజూనాథ్ రెడ్డి తెలిపారు. ఎవరైనా వీరిని గుర్తిస్తే పోలీసులకు తెలియజేయాలని సీఐ విజ్ఞప్తి చేశారు.