యర్రగొండపాలెం: విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయం నందు విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్ర ప్రస్థాన రాజభవనాన్ని నిర్మించడంతోపాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడని విశ్వకర్మను కొనియాడారు. ఆయనను దివ్య వడ్రంగి అని కూడా పిలుస్తారన్నారు.