వెలిగండ్ల మండలంలో వైసీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సూచించారు. సోమవారం మండల కేంద్రమైన వెలిగండ్లలో వైసీపీ ముఖ్య నాయకులతో నారాయణ యాదవ్ సమావేశం అయ్యారు. మండలంలో పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెలిగండ్ల మండలంలో అత్యధిక స్థానాలు వైసిపి గెలుపొందే విధంగా ఇప్పటినుండే నాయకులు తగిన కార్యాచరణతో ముందుకు సాగాలని నారాయణ యాదవ్ సూచించారు.