ప్రకాశం జిల్లా దర్శిలో గురువారం సాయంత్రం కోదండ రామస్వామి, సీతారామాంజనేయుల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. నగర పురవీధులలో భక్తులు కర్పూర హారతి, నైవేద్యాలు, పసుపు కుంకుమలను, కొబ్బరికాయలను స్వామివారికి సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు కలవకొలను ప్రదీప్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.