జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం ASF జిల్లా ఎస్. పి. కాంతిలాల్ పాటిల్ లతో కలిసి జిల్లాలో మాదకద్రవ్యాల నివారణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నివారణకు జిల్లాలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని,ASF ను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా,విక్రయించినా, వినియోగించినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.