శెట్టిబలిజల ఆత్మ అభిమానం దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు: మలికిపురం లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివకుమార్
కూటమి ప్రభుత్వ నాయకులు గత నెల రోజులుగా శెట్టిబలిజల ఆత్మాభిమానం దెబ్బతీసేలా అబద్ధపు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని మలికిపురంలోని మీడియా సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ సోమవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గీత కులాలైన మమ్మల్ని ఒకరికొకరు తన్నుకునేల జీవొ 16 తెచ్చిన విషయం మర్చిపోయారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2023లో తమ వైసీపీ ప్రభుత్వంలో జీవో 25 ఇచ్చి బిసీ-బి గా శెట్టిబలిజలను ఉంచేలా చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.