సంగారెడ్డి: సంగారెడ్డి ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.