పరకామణి కేసులో సతీశ్ హత్యకు గురయ్యాడని, హంతకులను కఠినంగా శిక్షించాలంటూ మంగళవారం శాలివాహన అధ్యక్షుడు ఆముదాలపల్లి గంగాధర్ కొండపి పట్టణంలో నిరసన తెలిపారు. నిజాయితీ గల అధికారిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలపర్తి పూర్ణచంద్రరావు, పెద్దకాశయ్య, సుబ్బయ్య, గుగ్గల శ్రీను, బ్రహ్మానందం పాల్గొన్నారు.