కొడిమ్యాల: స్వగ్రామమైన నాచుపల్లికి చేరిన ఖతార్లో మృతి చెందిన యువకుడి మృతదేహం
జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కంకణాల శ్రీకాంత్ అనే యువకుడు ఉపాధి నిమిత్తం ఖతార్ కు వెల్లాడు. ఈనెల 9న వాకింగ్ చేస్తున్న క్రమంలో గుండెపోటుతో మృతి చెందినట్లు అతని మృతదేహాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచన మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి స్వగ్రామానికి బుధవారం సాయంత్రం 7 గంటలకు తరలించినట్లు స్థానికులు తెలిపారు.