సూళ్లూరుపేటలో ఘనంగా దసరా ఉత్సవాలు
- భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో గురువారం దసరా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విశేష అభిషేకాలు పూజలు నిర్వహించిన భక్తులు వేద పండితులు ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని భక్తులతో పాటు పలువురు ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు సందర్శించారు. ఇందులో భాగంగా అమ్మణ్ణిని టిటిడి బోర్డు మెంబర్, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం నిర్వాహకులు ఆమెకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ చ