మిర్యాలగూడ: యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు మిర్యాలగూడ నియోజకవర్గంలో జరగలేదని అధికారులు వెల్లడి
నల్గొండ జిల్లా..మిర్యాలగూడ వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు విలేకర్ల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు.అధికారులు సోమవారం మధ్యాహ్నం 02 గంటలకు మాట్లాడుతూ యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు.ఎమ్మెల్యే గన్ మాన్ యూరియా లారీ పక్కదారి పట్టించారనే ఆరోపణ అవాస్తవమన్నారు. మంజూరు అవుతున్న యూరియా మొత్తం రైతులకే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిక..యూరియా సరఫరాలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన తమ దృష్టికి తీసుకురావాలన్నారు.