టేక్మల్: అమీర్పేట్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
Tekmal, Medak | Sep 17, 2025 సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం నాడు హైదరాబాద్ లోని అమీర్పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం హాస్పిటల్లోని అన్ని విభాగాలు రోగులతో కలిసి వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.