భీమడోలు మండల సర్వసభ్య సమావేశం, హాజరైన ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు
Eluru Urban, Eluru | Sep 27, 2025
అధికారులు సమన్వయంతో పనిచేసి మండలంలోని గ్రామల అభివృద్ధికి తోడ్పాడాలని ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. శనివారం భీమడోలు మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపి కనుమాల రామయ్య అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సదరు శాఖల అధికారులు వివరించారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు పలు అంశాలపై లేవనేత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్బంగా ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తదితర అంశాలను ప్రస్తావించారు.