శంకరంపేట ఏ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - కమారెడ్డి PRTU జిల్లా అధ్యక్షుడు కుశాల్
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - PRTU జిల్లా అధ్యక్షుడు కుశాల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని PRTU జిల్లా అధ్యక్షుడు కుశాల్ అన్నారు. సోమవారం మొహమ్మద్ నగర్ లో PRTU మండల నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ... ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని సదుపాయాలను సాధించేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో PRTU మండల అధ్యక్షులు వెంకటరమణ,సంతోష్, ప్రధాన కార్యదర్శి వెంకట్రాంరెడ్డి,సురేందర్, నాయకులు భాస్కర్ గౌడ్, పండరి, జనార్ధన్, కలకొండ నారాయణ, వెంకన్న తదితరులున్నారు.