ఇంద్రకీలాద్రి పై దసరా ఏర్పాట్లను పర్యవేక్షించిన: హోం మంత్రి వంగలపూడి అనిత
ఈ సంవత్సరం 15 లక్షల మంది భక్తులు దసరా ఉత్సవాలకి వస్తారని తగ్గ ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు సమయంలో హోం మంత్రి దసరా ఏర్పాట్లను ఇంద్రకీలాద్రిపై పర్యవేక్షించారు. అనంతరం ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. క్యూలైన్లు వీఐపీ వంటి విషయాలపై కమిషనర్ రాజశేఖర్ బాబు తో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు