రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీ వరద నీరు., 40 గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల అప్రమత్తంగా ఉండాలన్న ప్రాజెక్ట్ అధికారులు
శ్రీరామ్ సాగర్ కడెం వరద నీరు భారీగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి రావడంతో సుమారు 40 గేట్లు ఎత్తి గోదావరిలోని దిగువకు ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు ఈ సందర్భంగా వర్షాలు భారీ వరద వస్తున్న సందర్భంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి 7 నుండి 8 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి వదిలే అవకాశం ఉన్నందున నది పరివాహక ప్రాంతంలో ప్రజలు, రైతులు పశువుల కాపరులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.