అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని వెంకటగిరి సీఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
వెంకటగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని సీఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో పోలీసులతో పాటు పలువురు ప్రజలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సీఐ మాట్లాడుతూ... రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందన్నారు. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానం చేసిన వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలతో పాటు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.