బొబ్బిలి: బొబ్బిలి ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన RVSSK రంగారావు(బేబి నాయన)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బొబ్బిలి ఎమ్మెల్యేగా RVSSK రంగారావు(బేబినాయన) శుక్రవారం మధ్యాహ్నం 12:30 కు ప్రమాణం చేశారు. ప్రొటెమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బొబ్బిలి నియోజకవర్గం సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం బుచ్చయ్య చౌదరి తో పాటు, చంద్రబాబు, పవన్, లోకేష్, తదితరులకు నమస్కారం చేయగా.. వాళ్లు ప్రతి నమస్కారం చేశారు.