కరీంనగర్: బిసిల భావజాలాన్ని గ్రామ గ్రామాన గడపగడపకు తీసుకువెళ్తామన్నారు : రిటైర్డ్ IAS అధికారి చిరంజీవులు
BCల భావజాలాన్ని గ్రామ గ్రామాన గడపగడపకు తీసుకువెళ్తామన్నారు రిటైర్డ్ IAS అధికారి చిరంజీవులు. ఆదివారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ IAS అధికారి చిరంజీవిలు హాజరై.. BCలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కరీంనగర్ జిల్లాలో నేడు బీసీ రాజ్యాధికార సభ కోసం సమావేశం ఏర్పాటు చేశామని.. దీని ముఖ్యదేశం గత 75 సంవత్సరాలుగా BCలు ఎంతో నష్టపోతున్నారని ఇకనైనా మేల్కొని బీసీలు నష్టపోకుండా వారి హక్కులను సాధించే దిశగా పోరాటం చేయాలన్నారు.