తాడిపత్రిలో శ్రీ రంగనాథ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు చింతల రాయల్ పర్యవేక్షణలో మంగళవారం తిరుప్పావై కార్యక్రమంలో భాగంగా శ్రీ రంగనాథ స్వామి, గోదాదేవి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. రంగనాథ్ స్వామి భక్తులు తరలివచ్చారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు.