ప్రజలకు జవాబుదారీగా ఉండి సమస్యలు పరిష్కరించండి
: పోలీసు అధికారులను ఆదేశించిన ఏ.ఎస్. పి. అంకిత సురాన
ప్రజలకు జవాబుదారిగా ఉండి ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలని పోలీస్ అధికారులను పార్వతీపురం ఏఎస్పి అంకిత సురాన ఆదేశించారు. సోమవారం ఆమె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుండి పది అర్జీలను స్వీకరించారు. వాటిని విచారించి సకాలంలో పరిష్కరించి పోలీస్ ప్రధాన కార్యాలయానికి తెలియజేయాలన్నారు.