సత్ప్రవర్తనతో ఉండకపోతే జైలుకెళ్లడం తప్పదు : రౌడీ షీటర్లకీ పోలీసుల వార్నింగ్
జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లకు, నేరచరిత్ర కలిగిన వారికి నెల్లూరు జిల్లా పోలీసులు ఆయా స్టేషన్లో పరిధిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రజా శాంతికి భంగం కలిగిస్తే సహించేదన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ జరిగింది. ప్రస్తుతం ప్రజలకు పలు హెల్ప్ లైన్ లు అందుబాటులో ఉన్నాయని, రౌడీయిజం చేస్తే నిముషాలలోనే పోలీసుల దృష్టికి చేరుతుందని, అందుకు తగ్గట్టుగానే చర్యలు ఉంటాయని హెచ్చరించారు