మంత్రాలయం: మాధవరం రచ్చమర్రి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
మంత్రాలయం మండలం మాధవరం-రచ్చుమరి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి టెంపో ట్రావెలర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు మాధవరం ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం గట్టు బిచ్చల గ్రామానికి చెందిన భీమారావు ను టెంపో ట్రావెలర్ బలంగా గుద్దడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భీమారావు భార్య అంబిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శనివారం తెలిపారు.