అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండల కేంద్రంలో అధికారులు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు ఎంపీడీవో యాదగిరిశ్వరరావు తెలిపారు. మనమిత్ర యాప్ ప్రతి ఒక్కరు ఫోన్ లోను ఉంచుకోవడం ద్వారా 200 రకాల సేవలు అందుతాయని తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. అలాగే కొన్ని రకాల పాంప్లెట్లు ప్రజలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. మనమిత్ర యాప్ పై ప్రతి ఒక్కరూ అన్ని విషయాలు తెలుసుకోవాలని సూచించారు.