జిల్లాలో యానిమల్ హాస్టల్స్ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్ లక్ష్మీశా
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ సోమవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబుతో యానిమల్ హాస్టల్స్ ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలో వీటిని ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారుల సహకారం కోరారు. పాడి రైతులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో యానిమల్ హాస్టల్స్ నిర్వహించడానికి కలెక్టర్లకు సహకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.