తాడిపత్రి: తాడిపత్రిలోని పోలీస్ క్వార్టర్స్ కాంపౌండ్ వద్ద రాజు (47) అనే పెయింటర్ దారుణ హత్య, విచారణ చేపట్టిన పోలీసులు
తాడిపత్రి లోని పోలీస్ క్వార్టర్స్ కాంపౌండ్ వద్ద రాజు అనే పెయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి తరవాత చోటు చేసుకున్నప్పటికీ గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. భగత్ సింగ్ నగర్ కు చెందిన పెయింటర్ రాజు ను బండరాళ్లతో మోది అతి దారుణంగా హత్య చేశారు. సీఐ ఆరోహణరావు, ఎస్సై గౌస్ లు పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.