అన్నవరంలో ఆదివారం వీకెండ్ రద్దీ భక్తుల కోసం నిర్వహించిన రథోత్సవం
అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యసన్నిధిలో ఆదివారం స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా జరిగింది..వీకెండ్ సెలవు దినాలు కావడంతో శనివారం ఆదివారం రెండు రోజులు పెద్ద ఎత్తున భక్తులు రత్నగిరి కొండల పైకి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో ప్రత్యేక సేవలు సైతం దేవస్థానం ప్రారంభించింది. ఆదివారం జరిగిన ఈ రథోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు