రాజాంలో పార్టీ కార్యాలయంలో టిడిపి ఆవిర్భావ వేడుకలు
రాజాం పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో టిడిపి 42వ ఆవిర్భావ దినోత్సవ శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు