సిర్పూర్ టి: కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికుల సమ్మెతో మూడు రోజులుగా పడకేసిన పారిశుధ్యం
కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి మూడు రోజునుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పట్టణంలోని పలు కాలనీలలో పారిశుధ్యం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది. చెత్తాచెదారం పట్టణంలో పేరుకుపోవడంతో దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు,