వనపర్తి: పెద్దగూడెం తాండకు విద్యుత్ సరఫరాకు సర్వే నివేదికను సమర్పించాలన్న వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ పెద్దగూడెం తాండకు విద్యుత్ సరఫరా లైన్లో ఏర్పాట్లు విషయంపై డిఎఫ్ఓ అరవింద్ ప్రసాద్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరా లైన్లో ఏర్పాటు కోసం స్థలం సేకరించే విషయంపై సర్వే అటవీ అధికారులతో సంయుక్తంగా సమన్వయంతో పనిచేసే నివేదికను సమర్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వనపర్తి ఆర్డిఓ సుబ్రహ్మణ్యం విద్యుత్ శాఖ ఎస్సీ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.