మంత్రాలయం: ప్రభుత్వ హైకోర్టు ఏజీపీగా యువ స్వామి నియమకం పై హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు మాలపల్లి గ్రామస్తులు
మంత్రాలయం :మండలం మాలపల్లికి చెందిన న్యాయవాది యువశివ స్వామిని ప్రభుత్వం హైకోర్టు ఏజీపీగా నియమించింది. మల్లికార్జున స్వామి, మల్లేశ్వరమ్మ దంపతుల కుమారుడు యువశివ స్వామి మాలపల్లి పాఠశాల నుంచి విద్య ప్రారంభించి, 2019 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఈ నియామకంపై శనివారం కుటుంబసభ్యులు, స్నేహితులు, న్యాయవాదులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.