మంత్రాలయం: సాగు చేసుకునే రైతులకే రైతు వారి పట్టాలు ఇవ్వాలని మంత్రాలయం ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన రైతులు
మంత్రాలయం:సాగు చేసుకునే రైతులకే రైతు వారి పట్టాలు ఇవ్వాలని సోమవారం మంత్రాలయం ఎమ్మార్వో రమాదేవికి రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం ఇచ్చారు. సాగు చేసుకునే రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గత రెవిన్యూ అధికారులు రాఘవేంద్ర స్వామి మఠం పేరు మీద ఎఫ్ఎల్ఆర్ తయారు చేశారని ఆరోపించారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా సంబంధిత సర్వే నంబర్ భూములపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరారు.