ప్యాపిలి మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 1, 2026 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఊటకొండలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేల పింఛన్ మన రాష్ట్రంలోనే ఇస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, నాయకులు పాల్గొన్నారు.