కర్నూలు: కూడా అనుమతులు తప్పనిసరి : కర్నూలు కూడా చైర్మన్ శెట్టి వెంకటేశ్వర్లు
మంత్రాలయంలో కుడా అనుమతులు లేకుండా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి, ఇప్పటికే ఇళ్ళు నిర్మించుకున్న వారికి బీపీఎస్, ఎల్ఆర్ఎస్ రుసుములు చెల్లించి చట్టబద్ధమైన అనుమతులు పొందేందుకు అవకాశం ఉందని కర్నూల్ కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని ప్లాట్లు ఉన్నప్పటికీ బీపీఎస్ – ఎల్ఆర్ఎస్ రుసుములు చెల్లించడం ద్వారా పూర్తి హక్కులు పొందొచ్చని అన్నారు. భవిష్యత్తులో లీగల్ క్లీరెన్స్ కోసం ఇది తప్పనిసరి అవుతుందని ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.