అమీర్పేట: మాసబ్ ట్యాంక్ వద్ద కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన, అరెస్ట్ చేసిన పోలీసులు
మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను ముందు క్రమబద్ధీకరించాలని ఆ తర్వాత నూతన రిక్రూట్మెంట్ చేపట్టాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.