తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ రంగనాథ స్వామి, గోదాదేవి ఆలయంలో ఘనంగా ధనుర్మాస పూజలు, హాజరైన ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి
తాడిపత్రి పట్టణంలో గత కొన్ని రోజులుగా తిరుప్పావై కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. తిరుప్పావై కార్యక్రమంలో భాగంగా ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గురువారం బీజేపీ నేతలు రంగనాథరెడ్డి, శ్రీదేవి ఆధ్వర్యంలో రంగనాథ స్వామి, గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హాజరై పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.