మార్కాపురం: మన తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహం వద్ద ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చేతుల మీదుగా మన తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి ఇంగ్లీష్ మీడియం చదువుల్లో విద్యార్థులు మాతృభాష తెలుగును సరిగ్గా రాయడం చదవడం రావడంలేదని ఈ పుస్తకాన్ని విద్యార్థులు శ్రద్ధతో పట్టణం చేస్తే తెలుగుపై మంచి పట్టు లభిస్తుందని తెలిపారు.