నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రానికి చెందిన యువకుడు అదృశ్యం అయినట్లు మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ సోమవారం రాత్రి తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు మిడుతూరు గ్రామానికి చెందిన పింజరి. ఇదుర్ సాహెబ్,ముర్తుజాబి కుమారుడు ముర్తుజావలి(25) అదృశ్యం అయినట్లు తెలిపారు.ఇతనికి ఈ తాండ్రపాడుకు చెందిన అమ్మాయితో 2019లో వివాహం అయింది.వీరికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.భార్యకు ఆరోగ్యం సరిగ్గా లేదని సంవత్సరం క్రితం భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇతను నందికొట్కూరు హాజీ నగర్ లో చికెన్ షాపులో పని చేస్తున్నాడు.గత నెల 29వ తేదీన చికెన్ షాపుకు వెళ్తున్నానని తల్లికి చెప్పి వెళ్ళాడు.బంధువుల