భీమిలి: మంచినీటి సమస్య పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన గొల్లలపాలెం గ్రామస్తులు
పద్మనాభం మండలం అనంతవరం పంచాయితీ పరిధిలో ఉన్నటువంటి గొల్లలపాలెం గ్రామానికి సంబంధించి ఏళ్ల తరబడి నుండి ఉన్నటువంటి త్రాగునీటి సమస్యను, డ్రైనేజీ సమస్యను తీర్చాలని 100 మంది గ్రామ ప్రజలు ఎంపీడీవో కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. వర్షాకాలంలో వచ్చినటువంటి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటం వలన వర్షపు నీరు ఇళ్లలోకి రావటం, ఇంట్లో వాడకం నీరు కూడా బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవటంతో తీవ్ర అనారోగ్యాలకు గురి అవుతున్నామని ప్రజలు వాళ్ళ బాధను ఎంపీడీవో ఎం విజయకుమార్ ముందు వ్యక్తపరిచారు. అంతేకాకుండా గ్రామంలో ప్రజలందరూ త్రాగునీటి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు