దహెగాం మండలంలోని ఐనం గ్రామ శివారులో గురువారం సాయంత్రం 5గంటలకు ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్ పై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. రూ.65,270 నగదు, 5 మొబైల్ ఫోన్లు, టోకెన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. యువకులు 1-100 టోకెన్లతో సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ ప్రజలను మోసగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అక్రమ బెట్టింగ్పై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.