జగిత్యాల: రూరల్ మండలం చల్గల్ లో 10 ఎకరాలలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ, మంత్రి శ్రీహరిని కోరిన ఎమ్మెల్యే డా సంజయ్
క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సోమవారం కలిసి రూరల్ మండలం చల్గల్ లో 10 ఎకరాలలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ, వినతి పత్రాన్ని అందజేశారు. జగిత్యాల పట్టణంలో వివేకానంద మినీ స్టేడియంలో మధ్యలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయటం వల్ల మైదానం చిన్నగా మారిందని వివరించారు.,జిల్లా స్తాయి క్రీడల సమయంలో ఇబ్బందిగా ఉందని,జగిత్యాల జిల్లా కు ఒక మైదానం ఏర్పాటు ఆవశ్యకత గా ఉందని,జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారి లో చల్గల్ వాలంతరి క్షేత్రంలో స్థలం ఉందని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్ కూడా...