నారాయణ్‌ఖేడ్: సైబర్ నేరగాళ్లపట్ల జాగ్రత్తగా ఉండాలి: నారాయణఖేడ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఎస్ఐ శ్రీశైలం
వివిధ రూపాల్లో సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశం ఉంటుందని, అందుకోసం అప్రమత్తంగా ఉండటమే ఆయుధమని నారాయణఖేడ్ ఎస్ఐ రాశుల శ్రీశైలం అన్నారు. నారాయణఖేడ్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ రూపంలో సైబర్ నేరగాళ్లు వల వేస్తారని, ఫోన్‌కు వచ్చే ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు.