ఆలూరు: మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ విధానాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించండి : ఎమ్మెల్యే విరుపాక్షి
Alur, Kurnool | Nov 1, 2025 ఆలూరు పరిధిలోనే ఇంగళ దహాల్లో శనివారం ఎమ్మెల్యే విరుపాక్షి పర్యటించారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోందని, దీని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.